రష్యన్ భామతో పవన్ తీన్ మార్
Publish Date:Sep 4, 2012
Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ని వదిలేసి మరో ముద్దుగుమ్మతో ప్రేమాయణం సాగిస్తున్నాడని, వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డకూడా పుట్టిందని తాజాగా ఫిల్మ్ నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రికతోపాటు, దమ్మున్న ఓ ప్రముఖ వార్తా ఛానల్లో దీనిగురించి వార్తలొచ్చాక పవన్ కళ్యాణ్ తీన్ మార్ చిత్రంలో నటించిన రష్యన్ భామ దానా మార్క్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే పుకార్లు హైదరాబాద్ గల్లీలనుంచి ఢిల్లీ దాకా ఆగమేఘాలమీద పాకిపోయాయ్.
తీన్ మార్ చిత్రం సెట్లోనే వీరిద్దరికి ప్రేమ పుట్టిందని, ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. తీన్ మార్ సినిమా తరువాత నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, కొన్నినెలల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న అపార్ట్ మెంట్లో వీరు ఉంటున్నారని దమ్మున్న ఛానెల్ లో వచ్చిన వార్త గట్టి రిపోర్టే ఇచ్చింది. నేతిబీరకాయలో నెయ్యెంతుందో, ఈ పుకార్లలో నిజమెంతుందో శక్తిమంతమైన ఆ నక్షత్రమే క్లారిటీ ఇవ్వాలి మరి.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-love-affair|-pawan-kalyan-baby-boy|-pawan-kalyan-dana-marks|-actor-pawan-kalyan-baby--31-17096.html





